కేసీఆర్ వర్సెస్ బండి: అనవసరంగా ఇరుక్కున్నారా?

-

తెలంగాణలో బీజేపీ దూకుడు కొనసాగుతుంది…కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. రాజకీయంగా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడానికి బీజేపీ నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇక ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం…కేసీఆర్‌పై ఒంటికాలి మీద వెళుతున్నారు. పైగా అరెస్ట్ అయి బయటకొచ్చిన తర్వాత మరింతగా బండి, కేసీఆర్‌పై ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో బీజేపీకి చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు.

అలాగే కేసీఆర్ సైతం రంగంలోకి దిగి…బీజేపీని టార్గెట్ చేశారు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని చూశారు గానీ..అది పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో కేసీఆర్ రివర్స్‌లో ఇరుక్కున్నారు. తాజాగా ఎరువుల ధరల విషయంలో బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారు. ఎరువుల ధరలు పెంచి దేశ రైతాంగం నడ్డి విరిచారని, వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని, రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర చేస్తోందని బీజేపీపై కేసీఆర్ మండిపడ్డారు.

సరే కేంద్రాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తే…రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు, కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో రైతులకు ఎరువులను ఉచితంగా ఇస్తామంటూ 2017లో హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఐదేళ్లయినా దాన్ని అమలు చేయలేదని, మాట తప్పినందుకు క్షమాపణలు అడిగి తలదించుకోవాలని, కానీ, సిగ్గు లేకుండా ఎరువుల ధరలపై ప్రధానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.

వాస్తవానికి చూసుకుంటే కేసీఆర్…2017లో హామీ కిహారు. అసలు ఎరువులని ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పి హడావిడి చేశారు. ఇప్పుడు ఏమో తమ ప్రభుత్వం చేసే తప్పులని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రాన్ని టార్గెట్ చేశారు. అయితే కేంద్రాన్ని టార్గెట్ చేసి..అనవసరంగా కేసీఆర్ రివర్స్‌లో ఇరుక్కుపోయారు. మొత్తానికి బండి ఎక్కడా తగ్గకుండా కేసీఆర్‌ని ఇరుకున పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news