ఇకపై ఉద్యోగం మారితే ఈపీఎఫ్ కూడా ఆటేమేటిగ్గా ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంద‌ట‌..!

-

ఉద్యోగులు ఇక‌పై ఒక కంపెనీ నుంచి మ‌రొక కంపెనీకి మారిన ప‌క్షంలో ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫ‌ర్ క్లెయిమ్ కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సిన ప‌ని ఉండ‌దు. ఉద్యోగులు ఉద్యోగం మారిన వెంటనే ఈపీఎఫ్ కూడా ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంద‌ని కార్మిక‌శాఖ తెలిపింది.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్‌వో) ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది. ప్ర‌స్తుతం ఉద్యోగులు ఏదైనా కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారితే ఈపీఎఫ్ క్లెయిమ్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునేందుకు ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి వ‌చ్చేది. అయితే ఇక‌పై ఈ ప్ర‌క్రియ మరింత సుల‌భ‌తరం కానుంది. ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ క్లెయిమ్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప‌నిలేకుండానే ఇక‌పై ఈ ప్ర‌క్రియ‌ను ఆటోమేటిక్‌గా నిర్వ‌హించ‌నున్నారు.

ఉద్యోగులు ఇక‌పై ఒక కంపెనీ నుంచి మ‌రొక కంపెనీకి మారిన ప‌క్షంలో ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫ‌ర్ క్లెయిమ్ కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సిన ప‌ని ఉండ‌దు. ఉద్యోగులు ఉద్యోగం మారిన వెంటనే ఈపీఎఫ్ కూడా ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంద‌ని కార్మిక‌శాఖ తెలిపింది. ఈ క్ర‌మంలో ఈ స‌దుపాయం వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి అమ‌లులోకి రానుంది. దీని వ‌ల్ల ఉద్యోగ‌స్తుల‌కు ఎంతో మేలు జ‌ర‌గ‌నుంది.

కాగా ప్ర‌తి ఏటా ఈపీఎఫ్‌వోకు ట్రాన్స్‌ఫ‌ర్స్ క్లెయిమ్స్ 8 ల‌క్ష‌లకు పైగానే వ‌స్తున్నాయి. వాటిని నిర్వ‌హించ‌డం భార‌మ‌వుతున్న నేపథ్యంలోనే ఈపీఎఫ్‌వో ఆ ట్రాన్స్‌ఫ‌ర్స్‌ను ఆటోమేటిగ్గా చేసేలా మార్పులు, చేర్పులు చేస్తోంది. అందులో భాగంగానే ఈ ఆటోమేటిక్ ప్ర‌క్రియ‌ను ప్ర‌స్తుతం పైల‌ట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్ర‌మే నిర్వ‌హిస్తున్నారు. కానీ వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈపీఎఫ్ ఖాతాదారులంద‌రికీ ఈ స‌దుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news