బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆ పార్టీపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. బీజేపీ గిరిజనులకు ఏం చేసిందో చెప్పాలని బండి సంజయ్ కి సవాల్ విసిరింది. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మాణం చేసి పంపితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదని విమర్శించింది. బీజేపీ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో గిరిజనులకు,దళితలుకు కేంద్రంలోని బీజేపీ పాలనలో అన్యాయం జరిగిందని అన్నారు.
బండి సంజయ్ పోడు భూములపై పోరాటం చేస్తా అని అంటున్నారు… అటవీ చట్టాలు కేంద్రం పరిధిలో ఉంటాయనేది సంజయ్ గుర్తుపెట్టుకోవాలని సూచించింది. పోడు భూములపై మంత్రి వర్గ ఉప సంఘం ఇప్పటికే సీఎం కేసీఆర్ కు నివేదిక అందిచిందని ఆమె వెల్లడించారు. గిరిజనుల పట్ల బీజేపీ ప్రేమ ఉంటే రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించింది. ములుగులో గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్న కేంద్రం ఇప్పటికీ ఇవ్వడం లేదని ఆరోపించింది. గిరిజనులపై బీజేపీది కపట ప్రేమ అని అన్నారు.