గోవాలో బీజేపీకి భారీ షాక్… పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ సీఎం

-

ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు బీజేపీకి షాక్ లు తగులుతూనే ఉన్నాయి. పార్టీకి కీలక వ్యక్తులు రాజీనామా చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ పార్టీకి, మంత్రి వర్గానికి ముగ్గురు మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే గోవాలో కూడా బీజేపీకి ఎదురుదెబ్బలు తాకుతూనే ఉన్నాయి. గోవాలో బీజేపీ పార్టీకి మాజీ సీఎం లక్ష్మీ కాంత్ పర్సేకర్ రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ కొడుకు ఉత్పల్ పారికర్ కూడా పార్టీకి రాజీనామా పనాజీ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.

తాజాగా బీజేపీ తనకు టికెట్ కేటాయించనందుకు పార్టీకీ రాజీనామా చేస్తున్నారు మాజీ సీఎం లక్ష్మీ కాంత్ పర్సేకర్. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికైతే పార్టీకి రాజీనామ చేయాలని నిర్ణయించుకున్నా అని.. భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకుంటా అని అన్నాడు. లక్ష్మీకాంత్ పర్సేకర్ 2014-17 వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం గోవా ఎన్నికల్లో భాజపా మేనిఫెస్టో కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. పర్సెకర్ 2002 నుంచి 2017 వరకు ప్రాతినిథ్యం వహించిన మండ్రేమ్ అసెంబ్లీ స్థానంలో 2017లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్టే 2019లో బీజేపీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news