ఓటీటీలో రికార్డ్ సృష్టిస్తున్న బాలయ్య ‘అఖండ’

-

నందమూరి నటసింహం బాలకృష్ణ థియేటరైనా.. ఓటీటీ అయినా రికార్డు బద్దలవ్వాల్సిందే అన్న రీతిలో చెలరేగిపోతున్నారు. తాజాగా బాలయ్య నటించిన ‘ అఖండ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిస్నీ హాట్ స్టార్ వేదికపై ఇటీవలే రిలీజ్ అయింది. ఇక అభిమానులు పండగ చేసుకుంటున్నారు. విడుదలైన 24 గంటల్లోనే.. 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించింది. ఓటీటీ వేదికపై కూడా అఖండ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఈ రేంజ్ లో ప్రేక్షకులు అఖండను అదరిస్తుండటంతో బాలయ్య ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

కరోనా తరువాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో.. లేదో అనే డైలమాల మధ్య విడుదలైన ‘ అఖండ’ సినిమా భారీ సక్సెస్ సాధించింది. థియేటర్లకు అన్ని వర్గాల ప్రేక్షకులు క్యూ కట్టేలా చేసింది. బాలయ్య యాక్టింగ్ కి జనాలు నీరాజనాలు పలికారు. ఏకంగా 50 రోజుల్లో రూ. 200 కోట్ల గ్రాస్ సాధించింది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అఖండ నిలిచింది. మరోవైపు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ అన్స్టాపబుల్’ టాక్ షో కూడా పెద్ద హిట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news