ఐపీఎల్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త అందింది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ… ఇండియాలోనే ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే.. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే… ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని సమాచారం అందుతోంది. అంతేకాదు… కేవలం ఒకే స్టేడియంలో… ఐపీఎల్ 2022 మొత్తం టోర్నీ నిర్వహించాలని భావిస్తుందట బీసీసీఐ.
అది ఎక్కడో కాదు.. ముంబైలోని వాంఖాడే స్టేడియం లో… ఈ మెగా టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. అయితే.. దీనిపై మరి కొన్ని రోజుల్లనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. ఇండియాలో ఐపీఎల్ నిర్వ హణ క్రికెట్ లవర్స్ కు కాస్త ఊరట కలిగించినా… ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లు నిర్వహిచడం అందరిని బాధిస్తుంది. కాగా… కరోనా థర్డ్ వేవ్ ఇండియా విజృంభిస్తుంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ మళ్లీ దుబాయ్ లోనే నిర్వహిం చాలని మొన్నటి వరకు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
#IPL2022 will be in India only. It will be in Mumbai and will be without a crowd: Top BCCI sources to ANI
— ANI (@ANI) January 22, 2022