తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్ట్ విచారణ… కర్ఫ్యూ, ఆంక్షలపై నిర్ణయం… !

-

తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్ట్ లో విచారణ జరుగనుంది. గతంలో విచారణ చేసిన సమయంలో తెలంగాణలో ఆర్టీపీసీఆర్ టెస్టులను రోజుకు లక్షకు పెంచాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నేడు జరుగబోయే విచారణ సందర్భంగా రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ట్ టెస్టులతో పాటు కేసుల వివరాలను హైకోర్ట్ ముందుంచబోతోంది ప్రభుత్వం.

తెలంగాణలో ప్రస్తుతం నెలకొని ఉన్న కరోనా పరిస్థితులపై హైకోర్ట్ ఎటువంటి మార్గదర్శకాలు సూచిస్తుందో నేటి విచారణలో తెలియనుంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. దీంతో పాటు ఓమిక్రాన్ కేసులు కూడా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. రోజుకు కేసుల సంఖ్య 3500 కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూతో పాటు పలు ఆంక్షలను విధించేలా ప్రభుత్వానికి సూచించే అవకాశం కూడా ఉంది. కరోనా తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన జాగ్రత్తలను గురించి ప్రభుత్వానికి సూచించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news