ఏపీలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం అయింది. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్. 45-60 ఏళ్ల లోపు అగ్రవర్ణ పేద మహిళలకు రూ.15వేలు ఆర్థిక సహాయం చేసే నేపథ్యంలోనే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈ పథకం కారణంగా మొత్తం 3 లక్షల 92 వేల 674 మంది పేద మహిళలకు లబ్ధి చేకూరనుంది. పేద మహిలకు ఈ పథకం ద్వారా 5 వందల 89 కోట్లు అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ. 45 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇప్పటికే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగానే కొత్తగా ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు.