మెగాస్టార్‌ చిరంజీవి తో త్రిష రొమాన్స్‌ !

-

మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శిశ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దఃగా ఉంది. గాడ్‌ ఫాదర్‌, భోళా శంకర్‌ సినిమాలు లైన్‌ లో ఉన్నాయి. దీంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా రానున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాకు హీరోయిన్‌ గా ఎవరనే దాని పై చిత్ర బృందం సెర్చింగ్‌ మొదలు పెట్టింది.

మొదటగా హీరోయిన్‌ శృతి హాసన్‌ ను రంగలోకి దించాలని చిత్ర బృందం అనుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల త్రిషను హీరోయిన్‌ గా ఎంపిక చేసిట్లు సమాచారం అందుతోంది. చిరంజీవి సరసన హీరోయిన్‌ త్రిష అయితే.. బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోందట. ఇప్పటికే వీరి ఇద్దరి కాంబినేషన్‌ లో స్టాలిన్‌ మూవీ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ 16 సంవత్సరాలకు చిరంజీవి సరసన త్రిష నటించే చాన్స్‌ కొట్టేసింది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news