భువనగిరి (మ) వడపర్తి ఎంపీ దత్తత గ్రామంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కలెక్టర్ పమేలా సత్పతి. అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. కేసీఆర్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే ముఖ్యమంత్రి అని.. ప్రతి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగను అని హామీ ఇచ్చారు ఒకసారి వడపర్తి వచ్చి చూడు ఇక్కడ బోర్ నీళ్లే ఉన్నాయని ఫైర్ అయ్యారు.
వడపర్తి గ్రామానికి ఒక నీటి కనెక్షన్ ఇవ్వలేదని.. ఈ యాబై వెయ్యల కోట్లు ఎవరు ఏసుకొనిపోయారని ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏండ్లు అవుతుంది మాధవరెడ్డి స్వంత గ్రామాల్లో ఒక ఇల్లు కట్టలేదని మండిపడ్డారు. కొండ పోచమ్మ చూసి మురిసిపోవలా…గందమల్ల రిజర్వాయర్ లేదుగా…? అని ప్రశ్నించారు. ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్య అందించిన వాడే నిజమైన పాలకుడని పేర్కొన్నారు. తొమ్మిది ఏండ్ల తర్వాత ఇప్పుడు విద్యావ్యవస్థ మీద ఆలోచన వచ్చింది ఎన్నికల కోసమని.. ఫీజ్ రియంబర్స్మెంట్,ఆరోగ్య శ్రీ గాలి వదిలేసాడని ఆగ్రహించారు.