కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్‌ కు బీజేపీ లేఖ

కొత్త జిల్లాల ఏర్పాటు పై జగన్‌ సర్కార్‌ కసరత్తు మొదలు పెట్టినట్లు నిన్నటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. సీఎం జగన్‌ కు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. కొత్త నరసరావుపేట పార్లమెంట్ జిల్లాకు గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు జిల్లాగా పేరు పెట్టాలని కోరుతూ సీఎం జగన్‌కు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. పార్లమెంట్ నియోజకవర్గాల తరహాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేయాలని కోరుతూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నిర్ణయమని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో మెరుగైన పరిపాలన, వేగవంతమైన మరియు సమతుల్య అభివృద్ధి కోసం వీలైనంత త్వరగా అమలు చేయాలని జీవీఎల్ తన లేఖలో పేర్కొన్నారు. నరసరావుపేట గొప్ప చరిత్ర, సంప్రదాయం కలిగిన పల్నాడు ప్రాంతానికి ముఖ ద్వారం కాబట్టి, నరసరావుపేట కేంద్రంగా కొత్త నరసరావుపేట జిల్లాకు “గ్రేటర్ పల్నాడు” లేదా “మహా పల్నాడు” జిల్లాగా పేరు పెట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇది ఈ ప్రాంతం యొక్క గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక గుర్తింపుకు తగిన గుర్తింపుగా ఉంటుందని మరియు ఈ ప్రాంతం యొక్క వెనుకబాటు మరియు అభివృద్ధి అవసరాలపై దృష్టి సారిస్తుందని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలియజేశారు.