BREAKING : కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత.. సోమువీర్రాజు అరెస్ట్‌ !

-

కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. క్యాసినో వ్యవహరంపై నిరసన కార్యక్రమాన్ని ఇవాళ గుడి వాడ లో నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్‌ బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యలో.. ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు.. పార్టీ నేతలతో గుడి వాడ బయలు దేరారు. అయితే.. ఈ నేపథ్యంలో… మార్గ మధ్యలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

వారి కాన్వాయ్‌ లను అడ్డు కున్నారు పోలీసులు. దీంతో కృ ష్ణా జిల్లా నందమూరులో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ప్రస్తుతం వాగ్వాదం జరుగుతోంది. ఇక పార్టీ కార్యక్రమానికి వెళ్తుంటే అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమ అడ్డుకోవడం దారుణమని ఆగ్రహించారు.నాయకులను విడగొట్టి ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. కాగా.. గత వారం రోజుల గుడివాడ క్యాసి నో వ్యవహారం పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news