ప‌ట్ట‌ణ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని తీసుకురావాలి : కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ‌

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వం పై లేఖ అస్త్రాల‌ను కొన‌సాగిస్తున్నారు. తాజా గా ఈ రోజు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ కు మ‌రొక లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ మరొక డిమాండ్ ను తీసుకువ‌చ్చారు. దేశ‌ వ్యాప్తంగా ప‌ట్ట‌ణ జ‌న‌భా పెరుగుతున్న నేపథ్యంలో ప‌ట్ట‌ణ పేద‌రికం కూడా పెరుగుతుంద‌ని మంత్రి కేటీఆర్ లేఖ‌లో అన్నారు. దీంతో ప‌ట్ట‌ణ ప్ర‌జలు ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స పోతున్నార‌ని అన్నారు.

అయితే ప‌ట్ట‌ణ పేద‌రికాన్ని నిర్ములించే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం పట్టణ ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టాలని లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు. ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా పట్టణాల్లోని పేదల ఆదాయం పెరుగుతుంద‌ని అన్నారు. దీంతో ప‌ట్ట‌ణ పేద‌ల క‌నీస అవ‌స‌రాలూ తీరుతాయ‌ని అన్నారు. ప‌ట్ట‌ణ ఉపాధి హామీ ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని పార్లమెంటరీ స్థాయి సంఘం, సీఐఐ కూడా సిఫార్సు చేశాయ‌ని గుర్తు చేశారు. ప‌ట్ట‌ణ ఉపాధి హామీ ప్ర‌వేశ పెడితే.. దేశ వ్యాప్తంగా ప‌ట్ట‌ణాల‌ల్లో నివాసం ఉంటున్న 30 శాతం పేద ప్ర‌జ‌లకు మేలు జ‌రుగుతుంద‌ని లేఖ లో కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news