ఏపీలో ఆ జిల్లాలే స్పెషల్..జగన్ వ్యూహం ఏంటో?

-

జిల్లాల విభజన…ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే పెద్ద టాపిక్…ఇప్పుడు దీని గురించే ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. మేము పాత జిల్లాలోనే ఉంటున్నామని కొందరు, తాము ఆ జిల్లాలోకి వెళుతున్నామంటూ మరికొందరు మాట్లాడుకుంటున్నారు. 13 జిల్లాలని కాస్త పార్లమెంట్ స్థానాల వారీగా విడగొట్టి జిల్లాలు చేశారు. రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. 13 కాస్త 25 జిల్లాలు అవుతాయి. అయితే విస్తీర్ణంలో పెద్దగా ఉన్న అరకు పార్లమెంట్‌ని రెండు జిల్లాలుగా విడగొట్టారు. దీంతో మొత్తం 26 జిల్లాలు అయ్యాయి.

jagan
jagan

ఇక ఇందులో కొన్ని పాత జిల్లాల పేర్లు అలాగే ఉండగా, మిగిలిన వాటికి కొత్త పేర్లు పెట్టారు. అయితే ఇక్కడ కొన్ని స్పెషల్ జిల్లాలు ఉన్నాయి. అసలు ఒకో పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి..అంటే ఒకో జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి…ఒక అరకు తప్ప. కానీ అలా విడగొట్టలేదు. కొన్ని జిల్లాలు 8 అసెంబ్లీ స్థానాలతో…కొన్ని జిల్లాలు ఆరు అసెంబ్లీ స్థానాలతో విడగొట్టారు.
అరకుని ఎలాగో రెండుగా విడగొట్టారు. అల్లూరి సీతారామరాజు పేరుతో మూడు అసెంబ్లీ స్థానాలతో జిల్లా ఏర్పడింది. అలాగే మన్యం జిల్లా నాలుగు నియోజకవర్గాలతో ఏర్పడింది. ఇక శ్రీకాకుళం జిల్లా 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది..విజయనగరం పార్లమెంట్ స్థానంలో ఉన్న ఎచ్చెర్ల శ్రీకాకుళంలోకి వచ్చింది.

బాపట్ల పరిధిలోని సంతనూతలపాడు నియోజకవర్గం ఒంగోలులోకి వచ్చింది…నంద్యాల పరిధిలో ఉన్న పాణ్యం…కర్నూలు జిల్లాలోకి వచ్చింది. హిందూపురం పరిధిలో ఉండే రాప్తాడు…అనంతపురంలోకి వచ్చింది. ఇంకా విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఉండే శృంగవరపుకోట స్థానం…విజయనగరంలోకి వచ్చింది. ఇలా 8 స్థానాలతో కొన్ని జిల్లాలు ఏర్పడ్డాయి. అంటే రాజకీయంగా కొన్ని చోట్ల మరింత బలం పెంచుకోవడానికే జగన్ ఈ రకమైన వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. మరి ఈ జిల్లాల విభజన వైసీపీకి రాజకీయంగా ఏ మాత్రం కలిసొస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news