కారులో ‘బిల్డప్ బాబాయిలు’..?

-

కారులో బిల్డప్ బాబాయిలు ఎక్కువ అయిపోయారండి..మాటలు ఎక్కువ చేతలు తక్కువ నేతలు కారు పార్టీలో ఎక్కువ కనిపిస్తున్నారు. వీరు మీడియాలో హడావిడి చేయడమే తప్ప..ప్రజల్లోకి వెళ్ళి పనిచేయరు. ఇలాంటి నేతల వల్ల కేసీఆర్‌కు పావలా ఉపయోగం లేదనే చెప్పాలి. మామూలుగా రాజకీయాల్లో చేతల నాయకులు ఉంటేనే ఏ పార్టీకైనా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఈ మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మాటల నాయకులు ఎక్కువైపోయారు. వారి పని ఏం ఉండదు…తమ అధినేతలకు భజన చేయడం, ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేయడం. వీరు పట్టుమని జనంలోకి వెళ్ళి పది ఓట్లు తీసుకురాలేరు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

కానీ ఇలాంటి నేతలకే పదవులు ఇస్తారు. గతంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు చుట్టూ భజన చేసే నేతలే ఎక్కువ ఉన్నారు. వీరి వల్ల ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అలాంటి నేతలు వైసీపీలో కూడా ఉన్నారు. ఇంకా వారు కూడా జగన్‌కు భజన చేయడం…చంద్రబాబుపై విమర్శలు చేయడం చేస్తున్నారు. ఇంకా అంతే వారి పని.

ఇలాంటి వారు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. కేసీఆర్ చుట్టూ చేరి భజన చేసే నేతలు ఎక్కువైపోయారు. కేసీఆర్ దేవుడు అన్నట్లు డప్పు కొట్టేస్తుంటారు. ఈ బిల్డప్ బాబాయిల పని ఒక్కటే…పదవులు దక్కించుకోవడమే వారి పని. అందుకోసం కేసీఆర్‌ని పొగడటం, ప్రతిపక్షాలని తిట్టడం చేస్తారు. మైక్ కనబడితే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు.

మళ్ళీ ఈ నేతలు జనాల్లోకి వెళ్ళి నాలుగు ఓట్లు తీసుకురాలేరు. గతంలో ఇంత హడావిడి ఉండేది కాదు గాని, ఎప్పుడైతే ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగిపోయాయో అప్పటినుంచి ఈ భజన నేతలు టీఆర్ఎస్‌లో ఎక్కువైపోయారు. ఇక వీరి వల్లే కారు మునిగేలా ఉంది. అటు ఏపీలో ఇలాంటి నేతల వల్ల చంద్రబాబు దెబ్బతిన్నారు. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news