నిరుద్యోగులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని..అందరరం కలిసి కేసీఆర్ అంతు చూద్దామని పిలుపు నిచ్చారు బండి సంజయ్. ప్రత్యేక రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకొస్తయని ఎందరో యువకులు అసువులు బాస్తేనే తెలంగాణ వచ్చిందని.. తెలంగాణ రాష్టం వచ్చినా ఉద్యోగాల్లేక యువతీయవకులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ సీఎం అయ్యాక అమలు చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తుండన్నారు.
2014 అసెంబ్లీలో కేసీఆర్ 1 లక్షా 7 వేల ఖాళీ భర్తీ చేస్తానని నిరుద్యోగులను దారుణంగా మోసం చేసాడని.. ఏడున్నరేళ్ల నుండి ఒక్క గ్రూప్-1 లేదు… మూడేళ్ల నుండి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదని నిప్పులు చెరిగారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి చేసిన హత్యలుగానే బీజేపీ భావిస్తోందని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంవల్లే ఆత్మహత్యలు సంభవిస్తున్నయని ఆగ్రహించారు.
ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించని సీఎం… నిరుద్యోగులకు భరోసా ఇచ్చిన దాఖలాల్లేవని.. ఇప్పటిదాకా ఒక్క డీఎస్సీ లేదు.. ఒక్క లెక్చరర్ పోస్టు లేదు.. యూనివర్శిటీ ప్రొఫెసర్ పోస్టు భర్తీ లేదని చెప్పారు. బిశ్వాల్ కమిటీ…. 1 లక్షా 92 వేల ఖాళీలున్నయన్నదని.. ఆరోజు తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసింది పేదోళ్లే… ఈనాడు ఉద్యోగాల కోసం సూసైడ్ చేసింది పేదోళ్లేనని చెప్పారు.