లైంగిక వేధింపులకు గురై బాలిక ఆత్మహత్య చేసుకున్న కేసులో టీడీపీ నేత, వినోద్ జైన్ ను అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. గత ఎన్నికల్లో టీడీపీ కార్పోరేటరుగా పోటీ చేసిన వినోద్ జైన్… విజయవాడ టీడీపీ నేతలకు బాగా సన్నిహితంగా మెలిగారు. బాలిక సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. గత రెండు నెలల నుంచి బాలికను వేధిస్తోన్న వినోద్ జైన్… పలు సార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డడని తెలుస్తోంది. ఇక అతని వేధింపులు తట్టుకోలేక.. ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.
దీంతో పొక్సో చట్టం కింద కేసు నమోదు చేయడమే కాకుండా.. ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. బాలికను వినోద్ జైన్ వేధించాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు… ఆత్మహత్యకు పాల్పడ్డ బాలికను లిఫ్టులో తరుచూ వేధించేవాడని గుర్తించారు. వినోద్ జైన్ వేధింపుల గురించి ఎవ్వరికీ చెప్పుకోలేక మానసిక సంఘర్షణకు లోనైన బాలిక… చివరికి సుసైడ్ చేసుకుంది. ఇక ఈ సంఘటనపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.