తెలంగాణ చలికి గజగజ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఉదయం 11-12 గంటలు కానిదే చలి తగ్గడం లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలో 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైంది. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ శివారులోని హయత్ నగర్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో 9.7 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్లో గత పదేళ్లలో ఇదే రెండో కనిష్ట ఉష్ణోగ్రతగా రికార్డ్ గా నమోదైంది. వచ్చే మూడు రోజులు కూడా ఇలాగే చలి తీవ్రత, ఉష్ణోగ్రత తగ్గదల ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల గాలులతో చలి పెరుగుతోంది. 15 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
తెలంగాణకు అలెర్ట్… మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత
-