మోడీ సర్కార్ కు షాక్.. దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల పిలుపు

వ్యవసాయ చట్టాలపై కేంద్రం తగ్గినా.. తాము అస్సలు తగ్గేదే లేదంటూ రైతులు భీష్మించుకుని ఉన్నారు. తాజాగా రైతు సంఘాల నాయకులు మరోసారి నిరసనలకు పిలుపు నిచ్చారు. గత సంవత్సరం వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై జారీ చేసిన లేఖలోని ఏ హామీని ఇంత వరకూ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని.. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌ టికాయత్‌ ఆదివారం ఆరోపణలు చేశారు.

ఇందుకు నిరసనగా సోమవారం సంయుక్త కిసాన్‌ మోర్చా, బీకేయూ ఆధ్వర్యంలో.. దేశ వ్యాప్తంగా ద్రోహా దినం పేరుతో ఆందోన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటన చేశారు. డిసెంబర్‌ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా కొనసాగిన నిరసనలను ఉప సంహరించుకున్నామని.. అయితే.. వాటిని నెరవేర్చడం లేదని టికాయత్‌ విమర్శించారు. ఈ మేరకు నిన్న ఆయన ఓ ట్వీట్‌ చేశారు. దీంతో ఇవాళ మళ్లీ నిరసనలు తెలపనున్నారు రైతులు.