నేడు ఢిల్లీలో ‘బీజేపీ భీమ్’ పాదయాత్ర… కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసన

-

దేశంలో కొత్త రాజ్యాంగం తేవాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. మొన్న బడ్జెట్ పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పడేయాలంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గుజరాత్ కు మాత్రమే ప్రధాన మంత్రి అని విమర్శించారు. దేశంలో గుణాత్మక మార్పలు రావాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని తన అభిప్రాయాన్ని తెలిపారు.

ప్రస్తుతం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శల దాడిని పెంచారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే.. అంబేద్కర్ ను అవమానించడమే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ రోజు ‘ బీజేపీ భీమ్’ పేరుతో ఢిల్లీలో పాదయాత్రం చేయనున్నారు. బండి సంజయ్ అధ్యక్షతన ఈ పాదయాత్ర జరుగనుంది. మద్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పార్లమెంట్ వరకు పాదయాత్రం చేపట్టనున్నారు బీజేపీ నాయకులు. ఈ పాదయాత్రలో ఎంపీలు అర్వింద్, సోయం బాపురావు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news