మరో 25 ఏళ్లలో వ్యవసాయం రంగంలో పెనుమార్పలు వస్తాయని అన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. సరికొత్త సంకల్పంలో ఇక్రిశాట్ ముందుకు రావాాలని ఆయన అన్నారు. కొత్త వంగడాలను సృష్టించాలని ఆయన కోరాడు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. మన రైతులు ఎంతో కష్టపడి దిగుబడి పెంచుతున్నారన్నారు. జై జవాన్ – జైకిసాన్ నినాదం మనకు తెలుసు.. జై విಜ್ಞಾన్ జై అనుసంధాన్ నినాదాన్ని మోదీ చేర్చారని అన్నారు. తృణ ధాన్యాలను గురించి తోమర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాన్యుడి ఆహారంలో మిల్లెట్స్ భాగం కావాలని అన్నారు. కరోనా సమయంలో తృణ ధాన్యాల విలువ మనకు తెలిసిందని తోమర్ అన్నారు. తృణ ధాన్యాల ఉత్పత్తిని మరింత పెంచాల్సి ఉందన్నారు. అంతకుముందు ఇక్రిశాట్ చేరుకున్న మోదీ అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. మెట్ట పంటల పరిశోధనలను గురించి శాస్త్రవేత్తలు ప్రధాని మోదీకి వివరించారు.
మరో 25 ఏళ్లలో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు… ఇక్రిశాట్ స్వర్ణోత్సవంలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్
-