ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లనున్నారు. శంషాబాద్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు.
చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి రాత్రి 8 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి రాత్రి 9.05 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. మరొకవైపు ఈనెల 11న మరొకసారి సీఎం జగన్ హైదరాబాద్‌కు రానున్నారు. ఈనెల 11న హైదరాబాద్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు. కాగా సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.