తెలంగాణలో నేడు 1,217 క‌రోనా కేసులు.. ఒక‌రు మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి రోజు రోజుకు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. నేటి క‌రోనా బులిటెన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,217 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో నేటి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 7,77,530 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక‌రు క‌రోనా కాటు కు బ‌లై పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 4,100 మంది క‌రోనా మ‌హమ్మ‌రి వ‌ల్ల మ‌ర‌ణించారు. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో 3,944 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,46,932 కు చేరింది. కాగ ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26,498 మంది క‌రోనా నుంచి కోలుకోవ‌డానికి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే నేడు రాష్ట్రంలో 48,434 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. కాగ తెలంగాణ రాష్ట్రం తో పాటు దేశ వ్యాప్తంగా థ‌ర్డ్ వేవ్ క‌రోనా కేసులు సంఖ్య త‌గ్గుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ‌తంలో ప్ర‌తి రోజు దాదాపు 8 వేల‌కు పైగా కేసులు న‌మోదు అవుతుండ‌గా.. ప్ర‌స్తుతం రోజుకు 1000 కేసులు న‌మోదు అవుతున్నాయి. అలాగే మ‌ర‌ణాలు కూడా కొంత వ‌ర‌కు తగ్గాయి.

Read more RELATED
Recommended to you

Latest news