నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో భార్యను వదిలించుకోవడానికి భర్త అరాచకానికి పాల్పడ్డాడు. అచ్చం విక్రమ్ హీరో గా నటించిన ఐ సినిమా స్టైల్ లో ప్లాన్ వేసి.. తన భార్యను చంపాలని అనుకున్నాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన స్రవంతి, గంగసాగర్ లకు 2017 లో జరిగిన వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి 4 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి తన భార్యను వదిలించుకోవడానికి భర్త గంగా సాగర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇందులో బాగంగానే ఏకంగా స్కిన్ ఎలార్జి కోసం ట్రీట్ మెంట్ పేరుతో భార్య నరాలకు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ను ఇచ్చాడు భర్త గంగా సాగర్. దీంతో 25 ఏళ్లకే నరాల బలహీనతను గురైంది స్రవంతి. ఈ నేపథ్యం లోనే అనుమానం వచ్చి ఆసుపత్రిలో చూపించుకోగా.. ఇంజక్షన్ చంపడానికి ఇస్తున్నడని వైద్యులు తెలిపారు. ఆర్మూర్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేస్తూ నకిలీ ఆర్ఎంపీ గా క్లినిక్ పెట్టుకున్నాడు గంగాసాగర్. ఈ నేపథ్యంలోనే తన భార్యకు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ను ఇచ్చాడు భర్త గంగా సాగర్. ఇక విషయం తెలియాగానే.. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది అతని భార్య. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.