BREAKING : తెలంగాణలో ముగిసిన కరోనా థర్డ్‌ వేవ్‌..ఆంక్షలు ఎత్తివేత

-

తెలంగాన కరోనా కేసులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. కోవిడ్ మూడో వేవ్ తెలంగాణ లో జనవరి 28కి పీక్ చూసాము.. ఆ తరవాత తగ్గుతూ వచ్చిందన్నారు. ఇప్పుడు పాజిటివిటీ రేట్ తగ్గింది… తెలంగాణ లో 2 శాతం లోపే పాజిటివిటీ రేటు ఉందని చెప్పారు. ఈ లెక్కన తెలంగాణలో థర్డ్‌ వేవ్ ముగిసినట్టేనని ఆయన ప్రకటన చేశారు.

థర్డ్‌ వేవ్ లో ఒక్కో రోజు 4,559 కేసులు నమోదు అయ్యాయని.. సీఎం సలహాలు, సూచనలతో కోవిడ్ అన్ని వేవ్ లను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని చెప్పారు. ఫీవర్ సర్వే తో కోవిడ్ కంట్రోల్ లో సక్సెస్ అయ్యామని.. వాక్సిన్ ఒక ఆయుధంగా పని చేసిందని పేర్కొన్నారు.

మరో వారంలోగా కేసుల నమోదు వందకు పడి పోయే అవకాశం ఉందని.. అజాగ్రత్తగా ఉండొద్దు … కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచనలు చేశారు. వాక్సిన్ తీసుకున్న వారు తక్కువ హాస్పిటలైజ్ అయ్యారు… తీసుకోని వారు ఎక్కువగా ఆసుపత్రి పాలు అయ్యారని ఆయన గుర్తుచేశారు. అలాగే.. తెలంగాణ కరోనా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news