ఇక ఆరు పేప‌ర్లే.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గుడ్ న్యూస్

-

ప‌దో త‌ర‌గితి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. ప్రతి ఏడాది జ‌ర‌గే వార్షిక ప‌రీక్షల నిర్వ‌హాణ పై తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి వార్షిక ప‌రీక్షల‌లో ఆరు పేప‌ర్లేనే నిర్వ‌హిస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రీక్ష డైరెక్ట‌ర్ కృష్ణా రావు అధికారికంగా ప్ర‌క‌టించారు. కాగ గ‌తంలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్షల‌లో మొత్తం 11 పేపర్లు ఉండేవి. పేప‌ర్ 1, పేప‌ర్ 2 అంటూ ఒకే స‌బ్జెక్ట్ ను రెండు పేప‌ర్లుగా నిర్వ‌హించేవారు.

ఒక హిందీ పేప‌ర్ ను ఒక‌టిగానే నిర్వ‌హించేవారు. కానీ తాజా గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఇప్ప‌టి నుంచి 6 పేపర్లు మాత్ర‌మే ఉండ‌నున్నాయి. ఒకే ప‌రీక్ష ద్వారా 100 మార్కుల‌ను నిర్ణ‌యిస్తారు. అయితే ఇందులో 80 మార్కుల కోసం బోర్డు ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మ‌రో 20 మార్క‌ల కోసం ఇంట‌ర్న‌ల్ ప‌రీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. దీంతో చాలా కాలంగా విద్యార్థులు, మేధావులు చేస్తున్న డిమాండ్ నేటికి నెర‌వేరింది. కాగ ప‌దో త‌ర‌గతి విద్యార్థులు 11 పేప‌ర్లు రాయ‌డం వ‌ల్ల ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ప‌రీక్షలు నిర్వ‌హించ‌డానికి ఎక్కువ రోజులు కూడా ప‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news