ఆరోగ్య సేతు యాప్ తో ఆధార్ లాంటి యూనిక్ హెల్త్ ఐడి ని జెనరేట్ చేసుకోవచ్చు..!

-

కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్య సేతు యాప్ బాగా ఉపయోగపడింది. అయితే కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఆరోగ్య సేతు యాప్ ని ఉపయోగించి యూజర్లు యూనిక్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్ ని జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కి ప్రస్తుతం 16.4 కోట్ల ఏబిహెచ్ఏ నెంబర్లు ఉన్నాయి అని నేషనల్ హెల్త్ అథారిటీ చెప్పింది.

 

14 నవంబర్స్ తో యూనిక్ ABHA నెంబర్ ని యూజర్లు జనరేట్ చేసుకోవచ్చని చెప్పారు. ఇలా ఈ నెంబర్ ని జనరల్ చేసుకోవడం వల్ల కొత్త మెడికల్ రికార్డులు, పాత మెడికల్ రికార్డులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ల్యాబ్ రిపోర్ట్స్, హాస్పిటల్ రికార్డులు మొదలైనవన్నీ కూడా లింక్ చేసుకోవచ్చు.

అలానే రికార్డులని వైద్యులతో షేర్ చేసుకోవచ్చు. అయితే ఇలా డిజిటల్ గా వివరాలని నమోదు చేస్తే చాలా బెనిఫిట్ గా ఉంటుందని తెలిపారు. దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని పర్సనల్ హెల్త్ రికార్డులని యాక్సెస్ చేయడానికి సులభంగా ఉంటుందని అన్నారు.

ABHA నెంబర్ ని ఎలా జనరేట్ చేసుకోవాలి…?

ఆధార్ నెంబర్ ను ఉపయోగించి యూజర్లు ABHA నెంబర్ ని జనరేట్ చేసుకోవచ్చు.
మీ పేరు, డేట్ అఫ్ బర్త్, అడ్రస్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
ఆధార్ ద్వారా మీరు లాగిన్ అయితే డైరెక్టుగా ఓటిపి వస్తుంది.
ఒకవేళ మీరు ఆధార్ ప్రూఫ్ కింద పెట్టుకోవాలని అనుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా కూడా చేసుకోవచ్చు.
ABHA యాప్ ద్వారా కానీ https://abdm.gov.in/ లింకు ద్వారా కానీ జనరేట్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news