ప్రధాని నరేంద్ర మోడీ ని తరిమి..తరిమి కొట్టాలని… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో… మొదటగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని … ప్రారంభించారు. అనంతరం రాయగిరి లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిజెపి పార్టీ రైతుల పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల మెడపై కత్తి పెట్టి… మోడీ సర్కార్ విద్యుత్ చట్టాలను తీసుకు వస్తుందని నిప్పులు చెరిగారు. రైతులను అవమానిస్తున్నారు.. గుర్రాలతో తొక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తర ప్రదేశ్ లో రైతులను అన్యాయంగా కార్ల తొక్కించారు అని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ ఉంటే మత తత్వాల తప్ప… అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా దేశాన్ని సర్వనాశనం చేసింది అని మండిపడ్డారు. ఈ ఎనిమిది ఏళ్లలో మోడీ సర్కార్ చేసిందేమీ లేదని ఫైరయ్యారు సీఎం కేసీఆర్.