సీఎం కేసీఆర్ పై అసహనం… పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-

ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అయితే సిఎం కెసిఆర్ పర్యటనపై కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అ సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

భువనగిరి పార్లమెంట్ లో ఉన్న సమస్యల పరిష్కారానికై సీఎం తో చెప్పుకుందామంటే అవకాశం ఇవ్వలేదని ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తీసుకున్నాడు కానీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు.. ఉదయం నుండి మా పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అరెస్టులకు నిరసనగా, సీఎం తీరుకు నిరసనగా బోజనం చేయకుండానే కార్యకర్తలను కలవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news