టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అరెస్టు వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.నిన్నటి అర్ధరాత్రి వేళ ఆయనను పోలీసులు విడుదల చేశారు.దీంతో టీడీపీకి కాస్త ఊరట దక్కింది. సర్వీసు రిజిస్టర్ లో తప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ పొందుపరిచి పదోన్నతి పొందారన్న అభియోగంపై సీఐడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి విధితమే! ఈ కేసులో 18 గంటల పాటు ఆయనను విచారించిన అనంతరం విజయవాడ కోర్టుకు తరలించారు. అనంతరం న్యాయమూర్తి శుక్రవారం రాత్రి ఆయనకు బెయిల్ ఆర్డర్ ఇష్యూ చేశారు.ఇక ఈ వివాదంలో మరో మలుపు ఏ విధంగా ఉండనుందో!
వాస్తవానికి ఎప్పటి నుంచో ఏపీ ఎన్జీఓ సంఘ మాజీ అధ్యక్షుడిగా,ఎమ్మెల్సీగా ఉన్న పరుచూరి అశోక్ బాబు పై అనేక ఆరోపణలు ఉన్నాయి.సమైక్యాంధ్ర ఉద్యమాల్లో కూడా ముందు చాలా యాక్టివ్ గా కనిపించి తరువాత ఉద్యమాన్ని నీరుగార్చిన వైఖరిపై కూడా విమర్శలు ఉన్నాయి.అయినా కూడా టీడీపీ మాత్రంఆయనను నెత్తిన పెట్టుకుంది. ఆయనతో స్వచ్ఛంద పదవీ వివరణ చేయించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది.అప్పటి నుంచి ఆయన జగన్ పార్టీపై ప్రభుత్వంపై అదే పనిగా నిరాధార ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
ఈ దశలోఆయన అర్ధరాత్రి అరెస్టు జగన్ ఆధిపత్య ధోరణికి నిదర్శనం అని టీడీపీ విమర్శించినా,అదంతా రాజకీయంలో భాగం అన్నది పైకి తేలిన నిజం. ఆ రోజు తెరవెనుక కొన్ని ఒప్పందాల్లో భాగంగా ఉద్యమాల్లో భాగంగా పారిశ్రామిక వేత్తలతో ములాఖత్ అయి బాగానే డబ్బులు దండుకున్నారు అన్న ఆరోపణ కూడా అశోక్ పై ఉంది. అంతేకాదు వాణిజ్య పన్నుల శాఖలో కూడా ఆయన పనితీరుపై అనేక విమర్శలు ఉన్నాయి.కనుక ఆయన అరెస్టు అప్రజాస్వామికం అని టీడీపీ అన్నా కూడా దానిని పట్టించుకునేవారెవ్వరూ లేరు. పట్టాభి ఇష్యూ వేరు అశోక్ బాబు ఇష్యూ వేరు కనుక.