గిన్నిస్ రికార్డ్‌ సాధించిన ‘ముద్దు’..ఎన్ని గంటలో తెలుసా..?

-

రికార్డులు అసాధ్యాలు సాధ్యం చేసినప్పుడే కాదు..కొత్తగా వింతగా చేసి కూడా సృష్టించవచ్చు. ప్రపంచంలో ఎన్నో విచిత్రాలు రికార్డులు సృష్టించారు. ఇప్పుడు సూదీర్ఘ ముద్దు(long kiss) కూడా అందులోకి ఎక్కింది. కిస్ డే ఆఫ్ వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఈ రికార్డు సృష్టించారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట ఈ ముద్దుల రికార్డు సృష్టించింది.
ప్రపంచంలోనే అత్యంత సుధీర్ఘ ముద్దు 2013ల ఫిబ్రవరి 12, 14 మధ్య నమోదైంది. ఈ జంట 58 గంటల 35 నిమిషాల 58 సెకన్ల పాటు ఒకరినొకరు ముద్దుపెట్టుకుని రికార్డు సృష్టించారు. థాయ్‌లాండ్‌లోని మ్యూజియం రెపల్స్ బిలీవ్ ఇట్ అండ్ నాట్ కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలో 9 జంటలు పాల్గొన్నాయి. 70 ఏళ్ల వృద్ధ దంపతులు కూడా పోటీపడటం విశేషం..
థాయ్‌లాండ్‌లోని పటాయాలో జరిగిన ఈ పోటీల్లో ఎక్కచాయ్ తిరనారత్, లక్ష్యా తిరనారత్ దంపతులు ఈ రికార్డు సృష్టించారు. పోటీలో గెలుపొందిన తర్వాత ఈ జంటకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేట్ అందించారు. అంతేకాకుండా నిర్వాహకులు ఇద్దరికీ నగదు బహుమతి, డైమండ్ రింగ్ అందజేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కాంటెస్ట్‌లో గెలిచిన జంట అంతకు ముందే ముద్దులో రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. 2011లో ఎక్కువ సమయం ముద్దులు పెట్టుకుని రికార్డు సృష్టించారు. ఇది 46 గంటల 24 నిమిషాల 9 సెకన్ల పాటు కొనసాగింది. ఇక ఈ జంట ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. 2011, 2013లో రెండు రికార్డులు సృష్టించిన తర్వాత ఈ జంట థాయ్‌లాండ్‌లో చాలా ఫేమస్‌ అయ్యారు. సెలబ్రిటీల మాదిరిగానే వారి ఫోటో, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆ జంట రికార్డ్‌ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు.
అన్ని గంటల పాటు కిస్ పెట్టడం కూడా నిజంగా ఒక టాలంటే..చూడాలి వచ్చే సంవత్సరం అయినా..ఈ జంట రికార్డుని బ్రేక్ చేయగలిగే వారు ఉన్నారో లేదో..
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news