అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా…?: సీఎం కేసీఆర్

-

అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా..? అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. హౌడీ మోదీ అంటూ అమెరికా వెళ్లారని.. అమెరికా ఎన్నికలతో మీకేం సంబంధం.. ఎవరైనా వేరే దేశం ఎన్నికల్లో ప్రచారం చేస్తారా.. ఇది విదేశీ నీతేనా..? అని ప్రశ్నించారు. అక్కడకు వెళ్లి ‘అప్ కీ బార్ ట్రంప్ కి సర్కార్’ అంటారా.. ఇది టోటల్ గా ఇది వ్యూహాత్మక తప్పిదం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అమెరికా ఎన్నికల్లో ఏమైందని..అని విమర్శించారు. బుద్ది ఉన్న ప్రధాని ఎవరైనా.. ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారా.. అని అన్నారు. అక్కడకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. అని ప్రశ్నించారు. ఇలా వెయ్యి తప్పిదాలు ఉన్నాయని విమర్శించారు. ఇది చాలా దు:ఖించాల్సిన విషయం అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని పాలద్రోలాలని ఆయన పిలుపు నిచ్చారు. యువత దయచేసి ఆలోచించండి అంటూ కోరారు. కర్ణాటకలో ఏం జరుగుతున్నాయో చూసి ఆలోచించండి అంటూ యువతను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news