RX 100 Hero : కార్తికేయ ‘హిప్పీ’ టీజర్ విడుద‌ల‌

-

తొలి చిత్రం ఆర్‌ఎక్స్‌ 100తో హిట్‌ కొట్టిన కార్తికేయ నటిస్తోన్న చిత్రం హిప్పీ. ఈ చిత్రంలో మనోడు సిక్స్‌ప్యాక్‌తో ఇరగదీసినట్లు తెలుస్తుంది. ఆర్‌ఎక్స్‌ 100లో చేసిన రచ్చ ఈ చిత్రంలో కూడా కొనసాగించినట్లున్నాడు. లిప్‌లాక్‌ పోస్టర్‌తో అందరిని ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ కూడా జోష్ నింపిందని చెప్పొచ్చు.

టిఎన్ కృష్ణ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. ‘ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో దాన్ని పట్టుకున్నారు..అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతు అంటారు తెలుసా..’అని కమెడియన్ వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్స్ తో హిప్పీ టీజర్ ప్రారంభమవుతుంది. బాక్సర్ గా కార్తికేయ తన ప్రత్యర్థిపై పంచ్ లు విసురుతున్నాడు. టీజర్ చూస్తుంటే కార్తీకేయ ఓ వైపు లవర్ బాయ్ గా, మరోవైపు బాక్సర్ గా అభిమానులకు వినోదాన్ని అందించనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు యూత్ ఆడియెన్స్ కు కావాల్సిన అంశాలన్ని పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తున్న ఈ హిప్పీతో కార్తికేయ ఎలా అలరిస్తాడో చూడాలి.

Karthikeya Hippi Movie Teaser Released
Karthikeya Hippi Movie Teaser Released

Read more RELATED
Recommended to you

Latest news