నా తమ్ముడు కాదు.. నా నాయకుడు.. నేనేంటో చూపిస్తా : నాగబాబు

ఇప్పటి వరకు జనసేన పార్టీలోకి మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్‌ లేకుండా చూసుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఉన్నట్టుండి రంగంలోకి నాగబాబుని దించాడు. నాగబాబుకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు నరసాపురం పార్లమెంట్‌ స్థానం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు.
అనంతరం నాగబాబు మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యాడు. తన తమ్ముడు పులి లాంటి వాడని, గొప్ప లీడర్‌గా ఎదగడం సంతోషానిస్తుందని నాగబాబు తెలిపాడు. ఇంకా నాగబాబు మాట్లాడుతూ..


నా కంటే నా తమ్ముడు చాలా చిన్నవాడు.నేను ఎత్తుకుని ఆడించేంత వయసు గ్యాప్ మా మధ్య ఉండేది. చిన్నతనంలో చాలా క్యూట్‌గా ముద్దుగా ఉండేవాడు. తనను ఏడిపించడం అపుడు సరదాగా ఉండేది. అలాంటి వ్యక్తి ఎదుగుతూ మేమంతా ఆశ్చర్యపోయే ఒక గ్రేట్ లీడర్ అయ్యాడు. తనని చూస్తుంటే దేశంలో తనలాంటి మంచి క్వాలిటీస్ ఉన్న లీడర్స్ ఉన్నారా? అని ఒక్కోసారి అనిపిస్తుంది. నా తమ్ముడు నాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వడు. నా ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. ఫోన్ ఎత్తితే ఏం మాట్లాడాల్సి వస్తుందో అని సంకోచించేవాడని అన్నారు.

వాస్తవానికి కళ్యాణ్ బాబు పార్టీలో మా కుటుంబం నుంచి ఎవరూ ఇన్వాల్వ్ కాకూడదని అనుకున్నాం. నాకైతే రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలనే కోరిక ఉండేది. ప్రజారాజ్యం సమయంలో డిసప్పాయింట్ కావడంతో ఆ కోరికను వదిలేశాను. కళ్యాణ్ బాబు పార్టీ పెట్టిన తర్వాత మనసులో అనిపించినా తమ్ముడిని తమ్ముడిగానే చూద్దాం. నాయకుడిని నాయకుడిగానే చూద్దాం అని మనసులో అనుకున్నాను.

తమ్ముడు అనే విషయం పక్కనపెడితే…. అన్నింటికంటే మించి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి మా తమ్ముడు. జనసేనలో ఉన్న చాలా మంది కన్నా నాకే ఈ విషయం చెప్పడానికి ఎక్కువ హక్కుంది. ఎందుకంటే మా తమ్ముడిని చిన్నప్పటి నుంచి చూశాను.పులిలా ఉండేవాడు చిన్నతనంలో ఒక రకమైన పులిలా ఉండేవాడు. ఎవరి జోలికి వెళ్లేవాడు కాదు. తన పని తాను చేసుకునే వాడు. ఒంటరిగా కూర్చునేవాడు. ఏం చేస్తున్నావ్ కళ్యాణ్ అంటే ఏమీ చెప్పేవాడు కాదు. తనలో ఇంత స్ట్రగుల్ ఉందని తర్వాత లెలిసింది.

పార్టీలోకి రమ్మనగానే నమ్మలేదు, టెన్షన్ పడ్డా నన్ను పార్టీలోకి రమ్మని పిలిచిన తర్వాత నమ్మలేదు. ఆ తర్వాత టెన్షన్ పడ్డాను. నాకంటే చిన్నవాడు కాబట్టి పేరుకే తమ్ముడు. మీలాగే నాకూ ఆయన నాయకుడు పవన్ కళ్యాణ్.

క్లీనింగ్ చేయడానికైనా సిద్ధం పార్టీలో చేరకముందే జనసేన అభిమానిగా నా నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం ఏ పని చేయడానికికైనా సిద్ధంగా ఉన్నాను. ఆఫీసులో క్లీన్ చేయ్ అంటే చేయడానికి సిద్ధంగా ఉండేలా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాను. తమ్ముడి ఇన్స్‌స్పిరేషన్ తోనే ఇంతకాలం మాట్లాడుతూ వచ్చాను. ఇకపై నేనేంటో చూపిస్తానని నాగబాబు వ్యాఖ్యానించారు.