శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసింది బీసీసీఐ. కొత్త షెడ్యూల్ ను ఈరోజు విడుదల చేసింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం ముందుగా రెండు టెస్టులు ఆడిన తర్వాత టీ20 మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మార్చిన షెడ్యూల్ ప్రకారం ముందుగా మూడు టీ20 మ్యాచుల అనంతరం రెండు టెస్ట్ మ్యాచులు జరుగనున్నాయి. ఇంతకు ముందు ఇండియాలో శ్రీలంక జట్టు పర్యటన ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇప్పుడు ఫిబ్రవరి 24 నుంచే సిరీస్ ప్రారంభం అవుతోంది.
లక్నో మొదటి టీ20 కి ఆతిథ్యం ఇవ్వనుంది. తరువాతి రెండు టీ 20లకు ధర్మశాలలో జరుగనున్నాయి. మొదటి మ్యాచ్ లక్నో లో ఫిబ్రవరి 24, రెండు, మూడు టీ20 మ్యాచులు ధర్మశాలలో 26, 27 తేదీల్లో జరుగుతాయి. ఇక తొలిటెస్ట్ మార్చి 4 నుంచి 8 వరకు మొహాలీలో జరగనుండగా.. రెండో టెస్ట్ మార్చి 12 నుంచి 16 వరకు బెంగుళూర్ వేదికగా జరగనుంది.