కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో దూకుడుగా ఉండటానికి చూస్తున్నారు…ఎలాగైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళుతున్నారు. ఎలాగైనా కేంద్రంలో మోదీని గద్దె దించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ దిశగానే ముందుకెళుతున్న విషయం తెలిసిందే.
దీంతో మమతాతో కలిసి కేసీఆర్…మోదీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ఆవిర్భవించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మమతా బెనర్జీ దేశ రాజధానిలో నిర్వహించనున్న బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశంలో దీనిపై చర్చిస్తారని తెలిసింది. ఇకే ఈ ఫ్రంట్‌లో కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని తెలుస్తోంది.
మమతా బెనర్జీ, కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్, హేమంత్ సొరేన్, అరవింద్ కేజ్రీవాల్ ఇంకా ఇతర బీజేపీ యాంటీ నేతలు ఫ్రంట్‌లో ఉంటారని సమాచారం. ఇదే సమయంలో న్యూట్రల్‌గా ఉన్న బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఫ్రంట్‌లోకి తీసుకోచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ఫ్రంట్‌లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉండేలా లేరు..అయితే గతంలో తమతో కలిసిరావాలని తాను కాంగ్రెస్‌ను, సీపీఎంను అడిగానని, కానీ ఆ పార్టీలు తన మాట వినలేదని.. వారి విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని మమతా ఎప్పుడో చెప్పేశారు.
అయితే ఈ ఫ్రంట్‌లో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేరుతారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే జగన్, బీజేపీతో సఖ్యతతో ఉంటున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఈయనకు కేసీఆర్‌తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి కేసీఆర్ అడిగితే జగన్ కాదనకుండా ఫ్రంట్‌లోకి వస్తారా? లేదా? తెలియడం లేదు. మరి ఇప్పుడు బీజేపీతో కయ్యం పెట్టుకుంటే రాజకీయంగా ఇబ్బంది పడాలని సైలెంట్‌గా ఉండిపోతారా? అనేది చూడాలి.