ఇటీవల కేసీఆర్..కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా రాజకీయం నడుపుతున్నట్లు కనిపిస్తున్న విషయం తెలిసిందే…అనూహ్యంగా బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్…ఇటీవల అసోం సీఎం…రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలని కేసీఆర్ ఖండించి..కాంగ్రెస్ శ్రేణులు తనకు పాజిటివ్‌గా మార్చుకునే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. అయితే కేసీఆర్ మార్క్ రాజకీయాలకు చెక్ పెట్టడానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ఊసరవెల్లి లాంటి నేత అని, ఆయన మాటలు ఎవరు నమ్మొద్దని, అసలు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఏకం కావని చెబుతున్నారు.
ఇప్పటికే కేసీఆర్‌ని నమ్మి రెండుసార్లు మోసపోయామని, మళ్ళీ మోసపోవడానికి రెడీగా మాత్రం లేమని రేవంత్ చెబుతున్నారు. ఒకవేళ మోదీకి వ్యతిరేకంగా వెళ్లాలంటే కాంగ్రెస్ మిత్రపక్షాలని కాకుండా..న్యూట్రల్‌గా ఉండే పార్టీలని కేసీఆర్ ఏకం చేయాలని అలా కాకుండా…కాంగ్రెస్‌కు దగ్గరగా ఉన్న స్టాలిన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ లాంటి వారితో కలిసి మరో ఫ్రంట్ పెట్టాలని చూస్తున్నారని, ఇది పూర్తిగా యూపీఏని చీల్చే కుట్ర అని రేవంత్ రెడ్డి అంటున్నారు.
అసలు జగన్, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్, నితీశ్ కుమార్, మాయావతిని కేసీఆర్ ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. మోదీకి లబ్ది చేకూర్చేందుకే ఫ్రంట్ పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని విమర్శించారు. అయితే రేవంత్ చెప్పిన లాజిక్ కరెక్ట్‌గానే ఉందని చెప్పొచ్చు. కాంగ్రెస్ మిత్రపక్షాలనే కేసీఆర్ కలుస్తున్నారు తప్ప…న్యూట్రల్‌గా ఉండేవారిని కలవడం లేదు. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలి ఆటోమేటిక్‌గా బీజేపీకి లాభం జరుగుతుంది. అందుకే రేవంత్, కేసీఆర్ మాటలని నమ్మవద్దని అంటున్నారు.
కాకపోతే ఇక్కడ రేవంత్ లాజిక్ కరెక్ట్ గానే ఉన్నా సరే…కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న వారు సెపరేట్‌గా ఫ్రంట్ ఏర్పాటు చేయడానికే చూస్తున్నారు..మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ ఫ్రంట్ ఏర్పాటు అవుతుంది…అంటే కేసీఆర్ జోక్యం ఉన్నా లేకపోయినా…కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం సెపరేట్‌గా రాజకీయం చేస్తున్నాయి. మరి చూడాలి ఈ ఫ్రంట్ రాజకీయం ఏ మేర వర్కౌట్ అవుతుందో.