సీఎం కేసీఆర్ పుట్టిన రోజుపై రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్..”ఊసరవెల్లి” అంటూ

-

నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు 68వ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వేడుక‌లు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు పుట్టిన రోజు ఉత్స‌వాల‌ను జ‌రుపుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.

revanth-reddy-cm-kcr

ఊసరవెల్లి ఫోటోలు షేర్ చేస్తూ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు రేవంత్ రెడ్డి. అంటే సీఎం కేసీఆర్ మాటలు ఊసరవెల్లిలా ఉంటాయి అని అర్థం వచ్చేలా ఈ ఫోటోని షేర్ చేశారు రేవంత్ రెడ్డి. ఇక ఈ పోస్టర్ పై నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా…ఇవాళ  రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద… ఆయనను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఉదయం నుంచి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కాపు కాసిన… పోలీసులు… కాసేపటికి రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news