పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై దాఖలైన పిల్ ని కొట్టేసిన కలకత్తా హైకోర్ట్

-

పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ని కలకత్తా హైకోర్ట్ కొట్టేసింది. రామ్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గవర్నర్ జగదీప్ ధంఖర్ పై నమోదైన పిల్ ను కొట్టేసింది.  గవర్నర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యుడని, దాని మౌత్ పీస్ గా వ్యవహరిస్తున్నారని.. గవర్నర్ ని తొలగించాలంటూ.. లాయర్ రామ్ ప్రసాద్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, జస్టిస్ రాజర్షి భరద్వాజ్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించి తీర్పునిచ్చింది. 

రాష్ట్ర వ్యవహారాల పనితీరులో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని పిటిషన్ కోర్ట్ లో వాదించాడు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని గేమ్ ప్లాన్ చేసి.. ఆర్టికల్ 365 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చని పిటిషనర్ వాదించారు. రాష్ట్ర మంత్రి మండలి సలహాల మేరకే గవర్నర్ నడుచుకోవాలని.. అయితే ఆయన వాటిన్నింటిని పట్టించుకోవడం లేదని పిటిషనర్ వాదించాడు. పశ్చిమ బెంగాల్ లోనే కాకుండా.. తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నట్లు కోర్ట్ లో ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఈ వాదనలతో ఏకీభవించని కోర్ట్ పిల్ ను కొట్టేసింది.

Read more RELATED
Recommended to you

Latest news