ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు నేటి కరోనా బులిటెన్ ను విడుదల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 500 కన్న తక్కవే కరోనా కేసులు నమోదు అయ్యాయి. నేడు కేవలం 495 కరోనా కేసులు వెలుగు చూశాయి. నిన్నటితో పోల్చినా.. నేడు కేసుల సంఖ్య కొంత వరకు తగ్గాయి. గురు వారం రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 528 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కాగ థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత మొదటి సారి ఆంధ్ర ప్రదేశ్ లో 500 కన్న తక్కువ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే నేడు రాష్ట్రంలో కరోనా మహమ్మారి వల్ల ఒకరు మృతి చెందారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజుల ముందు రోజుకు 4 నుంచి 5 కరోనా మరణాలు నమోదు అవుతుండగా.. నేడు ఒకటి నమోదు అయింది. అలాగే రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,543 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8,421 మాత్రమే ఉన్నాయి.