ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సచివాలయంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న కరోనా నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కాసేపటి క్రితం విడుదల చేశారు. కాగ ఇటీవల కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ ద్వారా థర్డ్ వేవ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ తో పాటు పలు కరోనా నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.
అంతే కాకుండా సచివాలయంలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో సచివాలయంలో కూడా పలు ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. తాజా గా రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో సచివాలయంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తు.. నిర్ణయం తీసుకుంది. ఇక సచివాలయంలో ఉన్న అన్ని శాఖల కార్యదర్శులు సచివాలయానికే రావాలని సీఎస్ సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.