ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ మరొకసారి వృద్ధి చెందుతుంది అని అనుకుంటే పెద్ద షాక్ ఏ ఎదురయింది. రేవంత్ రావడంతో పార్టీలో వర్గ విభేదాలు వచ్చాయి. అయితే టీ కాంగ్రెస్ లోని లోపాలని చెబుతూ జగ్గారెడ్డి ఢిల్లీ హైకమాండ్ కి రాసిన లేక ఇప్పుడు దుమారం రేపుతోంది.
ఇక దీని కోసం చూస్తే… తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు చాలా మంది పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే ఎవరైనా వచ్చి లాబీయింగ్ చేస్తే పిసిసి అవ్వచ్చు. ఇంతకంటే తప్పు నేను చేయలేదు. పైగా సొంత పార్టీలోనే కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా జగ్గారెడ్డి టిఆర్ఎస్ కోవర్టులని ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ ఎదురు చెప్పకపోవడం దురదృష్టం.
జగ్గారెడ్డి అని పిలిస్తే తమ్ముడు పోయాడు అని ఒక చరిత్ర ఉంటుంది అని. ఎప్పుడు వేరే పార్టీలోకి పోలేదని ఇంత ఆర్థిక కష్టాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇలా ప్రచారం సాగుతోందని జగ్గారెడ్డి వ్రాసారు. నా తల్లిదండ్రులు నాకు ఈ జన్మని ఇచ్చారు. అయితే అందరికీ ఉపయోగపడేలా ఉండాలని.. మంచి పేరు తెచ్చుకోవాలని నాకు ఉంది.
అదే నా తల్లి కోరిక కూడా అని చెప్పారు. ఎప్పుడు నా వ్యక్తిత్వాన్ని అమ్ముకోను అని రాశారు. కాంగ్రెస్ నాకు ఇలాంటి కోవర్టు అనే పేరు ప్రచారం జరగడం బాధాకరమని జగ్గా రెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలను వేరు చేసేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని నన్ను తెలంగాణ ద్రోహి అన్నారు. గ్రౌండ్ లోకి వెళ్లండి అని అంటే కోవర్టు అని ఆరోపణలు చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్రంలో 12 స్థానాలకు జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో నా భార్య నిర్మల చేత పోటీ చేయించి ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ఓట్ల కంటే ఒక ఓటు తగ్గినా కూడా ఆ పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని… పార్టీ పరువు మర్యాద ముఖ్యమని అనుకున్నాను కానీ పార్టీ నన్ను ఇలా అంటుందా అని అన్నారు. 2017 లో రాహుల్ గాంధీ సభ పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు.
అటువంటి సమయంలో నేను కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకొచ్చారు. ఎవరైనా తప్పుడు తోవలో వెళ్తుంటే నేను మాట్లాడకుండా ఊరుకోవాలా అని అడిగారు. అలానే రాజకీయాల్లో ఉండటం ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పారు. మహాభారతంలో పాండవులకు, కౌరవులకు జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో ఇటు భీష్ముడు నాయకత్వం వహిస్తాడు అలాగే అటు వైపు అర్జునుడు కూడా నాయకత్వం వహించాడు.
యుద్ధం ప్రారంభం కంటే ముందు అర్జునుడు భీష్మునికి బాణాల ద్వారా పాదాలకు నమస్కారం చేస్తాడు. దాని ద్వారా అర్జునుడు భీష్ముడికి కోవర్టు కాదు కదా..?అక్కడ నమస్కరించడం అదే సంస్కారం ఆ తరువాత యుద్ధం యుద్ధమే అని లేఖలో రాశారు.