తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలోని గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. సహజంగా మార్చి ఒకటో తేదీ నుంచి వేసవి కాలం గా పరిగణిస్తారు. అయితే ఈసారి వేసవి కాలం మాత్రం కాస్త ముందుగానే ప్రారంభం కానున్నట్లు కనిపిస్తోంది.
మొన్నటి వరకు దాదాపు 28 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఆదివారం నాడు మాత్రం ఒక్కసారిగా 34 డిగ్రీల సెల్సియస్క్ కు పెరిగింది. ఇక ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని మంచు దుప్పటి కప్పేసింది.
ఇక ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో కనీసం రెండు నుంచి మూడు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు పెరిగి చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది.