సాయిరెడ్డి ఇన్ యాక్షన్.. ఇంకా ‘ఫ్యాన్’ సెట్?

-

ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు టీడీపీ కంచుకోట.. కానీ 2019 ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది.. ఉత్తరాంధ్రలో ఫ్యాన్ హవా మొదలైంది.. అనూహ్యంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఫ్యాన్ సత్తా చాటింది.. గత ఎన్నికల్లో పూర్తిగా మూడు జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం.. ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లు ఉంటే వైసీపీ 28 సీట్లు గెలుచుకోగా, టీడీపీ 6 సీట్లు గెలుచుకుంది.. అంటే టీడీపీకి వైసీపీ ఏ విధంగా చెక్ పెట్టిందో అర్ధం చేసుకోవచ్చు.

 

అయితే ఇలా వైసీపీ సత్తా చాటడంతో జగన్ ఇమేజ్ ఎంత ఉందో.. విజయసాయి రెడ్డి కష్టం కూడా అంత ఉంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం.. పైగా విశాఖ ఎంపీగా పోటీ చేసి విజయమ్మ సైతం ఓడిపోవడంతో.. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలోనే సెటిల్ అయ్యి.. వైసీపీని సెట్ చేయాలని అప్పుడే డిసైడ్ అయిపోయారు. అప్పుడు నుంచి ఉత్తరాంధ్రలో వైసీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. విజయసాయి రెడ్డి పనిచేస్తూ వచ్చారు. అలా చేయడం వల్లే ఉత్తరాంధ్రలో వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయిపోయాయి.. ఇక ఈ రెండున్నర ఏళ్లలో వైసీపీ ప్రజాప్రతినిధులు కాస్త ప్రజా మద్ధతు పెంచుకోవడంలో విఫలమవుతున్నారు. అలాగే అభివృద్ధి పనులు చేయడంలో వెనుకబడి ఉన్నారు.. అలాగే పలు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో పార్టీని సెట్ చేయడానికి మళ్ళీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగుతున్నారు.. నేతల మధ్య ఆధిపత్య పోరును కట్టడి చేయడం.. పార్టీ గెలుపుకోసం పోరాటం చేసిన వారిని గుర్తించి ప్రోత్సహించేలా నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్ధమవుతున్నారు.

ఎన్నికల హామీలు ఏ మేరకు నెరవేరాయి? పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయడం వంటి అంశాలని తెలుసుకుని ఎమ్మెల్యేలని మరింత ఎక్కువగా ప్రజల్లో ఉంచాలనే ఉద్దేశంతో సాయిరెడ్డి పనిచేయనున్నారు. అలాగే నాయకుల మధ్య ఉన్న విభేదాలకు చెక్ పెట్టి, పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు. చూడాలి మరి ఉత్తరాంధ్రలో ఫ్యాన్‌ని సాయిరెడ్డి ఏ విధంగా సెట్ చేస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news