ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య భీకర పోరు జరుగుతోంది. నిన్న మొదలైన వార్ పీక్స్ చేరుకుంది. ఉక్రెయిన్ లోని వివాదాస్పద ప్రాంతాలను రష్యా ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది. మిలిటరీ యాక్షన్ పేరిట రష్యా భీకరంగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం అయింది రష్యన్ ఆర్మీ. రాజధాని కీవ్ అన్ని రహదారులను చుట్టుముట్టింది.
అయితే ప్రపంచంలో రష్యా వైపు, ఉక్రెయిన్ వైపు పలు దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. రష్యా వైపు చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, క్యూబా, ఇరాన్, సిరియా, వెనుజులాతో పాటు ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశాలు కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, బెలారస్, ఆర్మెనియా వంటి దేశాలు మద్దతు తెలుపుతున్నాయి.
ఉక్రెయిన్ వైపు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనెడా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, మద్దతు పలికాయి. దీంతో పాటు నాటో కూటమిలో ఉన్న 30 దేశాలు కూడా ఉక్రెయిన్ కు మద్దతు తెలిపాయి. భారత్ మాత్ర తటస్థ వైఖరిని అవలంభిస్తున్నాయి