పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి మార్కెట్ వెళ్లే జెఎన్ రోడ్డులో ట్రాఫిక్ జామ్, పార్కింగ్ కోసం మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, పట్టణ ఇన్స్పెక్టర్ మధు సందర్శించారు. దుకాణాల సముదాయం యజమానులు, వీధి వ్యాపారులకు పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు, పరిష్కారంపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వ్యాపారులు సహకరించాలని సూచించారు.