దీనిని డైట్ లో ఎక్కువగా తీసుకుంటున్నారా..? అయితే జుట్టు ఎక్కువ రాలిపోవడానికి కారణం ఇదే..!

-

చాలా మంది జుట్టు రాలిపోతోంది అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎందుకు జుట్టు రాలిపోతుంది అనేది కూడా అర్థం కాదు. కేవలం మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా ఈ సమస్యతో సతమతమవుతున్నారు. అయితే జుట్టు రాలిపోవడానికి గల కారణాలు రీసెర్చర్లు వెల్లడించారు. ఫేమస్ ట్రికాలిస్ట్ యూకే, ఏమంటున్నారంటే డైట్ లో ఎక్కువ సాల్ట్ ని తీసుకోవడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయి.

ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి ఉప్పు ముప్పు తీసుకు వస్తుందని చెప్తున్నారు. ఎక్కువ సాల్ట్ ని మీ డైట్ లో తీసుకోవడం వల్ల సోడియం ఫామ్ అయ్యి అది జుట్టుని ఎఫెక్ట్ చేస్తుందని. అలానే హెయిర్ ఫాలికల్స్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ను కూడా జరగదని చెపుతున్నారు. ఈ కారణంగా ఏమవుతుందంటే మంచి పోషక పదార్థాలు జుట్టు దగ్గరికి వెళ్ళవు.

అలానే ఎక్కువ సోడియం తీసుకోవడం వల్ల జుట్టు జీవనాన్ని కోల్పోతుందని. పైగా జుట్టు చాలా వీక్ గా అయిపోతుందని అన్నారు. అలానే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల జుట్టు రాలిపోతుంది కూడా. బాగా తక్కువ సాల్ట్ ని తీసుకోవడం వల్ల అయోడిన్ లోపం కలుగుతుందని చెప్పారు.

జుట్టు యొక్క ఆరోగ్యం మనం తీసుకునే విటమిన్స్ మరియు మినిరల్స్ మీద ఆధారపడి ఉంటుందని ఐరన్ మరియు విటమిన్స్ వంటివి తీసుకోవడం వల్ల జుట్టు రాలదని చెప్పారు. కాబట్టి జుట్టు ఆరోగ్యం బాగుండాలంటే వీటిని అనుసరించండి. దీనితో జుట్టు రాలదు.

Read more RELATED
Recommended to you

Latest news