మోదీ ఇలాకాకు కేసీఆర్… చివరి విడత యూపీ ఎన్నికల్లో ప్రచారం..?

-

ప్రధాని మోదీతో సై అంటే సై అంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటికే మోదీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు కేసీఆర్. ఇక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే పలు రాష్ట్రాల ఎన్డీయేతర సీఎంలతో వరసగా సమాేవశ అవుతున్నారు. ఇటీవల మహారాష్ట్రకు వెళ్లి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లను కలిశారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్ తో టచ్ లో ఉన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా కేసీఆర్ పోరాటానికి మద్దతు తెలిపారు. 

తాజాగా మోదీ సొంత ఇలాకా వారణాసిలో నేరుగా తలపడేందుకు సీఎం కేసీఆర్ సిద్ధం అవతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా… యూపీలో ఇప్పటికే 5 విడతల ఎన్నికలు ముగిశాయి. ఇదిలా ఉంటే చివరి విడత ఎన్నికల్లో భాగంగా వారణాసి ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ సెగ్మెంట్ లో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్ వంటి నేతలు ప్రచారం చేయనుండగా.. వీరితో కలిసి కేసీఆర్ ప్రచారం చేస్తారా…? లేక పోతే ఒంటరిగానే ప్రచారంలో పాల్గొంటారా తేలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news