ఉక్రెయిన్ దేశంపై రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా… ఉక్రెయన్ రాజధాని “కీవ్”లోని ప్రజావాసాల పై రష్యా ఆర్మీ ఫిరంగులు వర్షం కురిపిస్తోంది. దీంతో ఇప్పటి వరకు 342 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం… కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ ప్రాంతాన్ని భారతీయులు తక్షణమే మొదలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కీవ్ ప్రాంతం నుంచి ఎలాగైనా బయటపడాలని… కేంద్రం సూచనలు చేసింది. కీవ్ ఈ ప్రాంతంలో ఏ క్షణమైనా రష్యా భద్రత దళాలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం. ఇక భారతీయులను తరలించేందుకు C-17 విమానాలను ఉక్రెయిన్ పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముక్యంగా కీవ్ లోని వారిని తక్షణం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే కీవ్ లో రాయబారులను ఖాళీ చేయించింది అమెరికా. దీంతో ఏ క్షణం ఏం అవుతుందోనని అందరూ టెన్షన్ పడుతున్నారు.