ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువస్తోంది భారత ప్రభుత్వం. ‘ఆపరేషన్ గంగ’ పేరుతో భారతీయ విద్యార్థులను ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. తాజాగా ఆపరేషన్ గంగను మరింత వేగం చేసేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి భారత వాయుసే రంగంలోకి దిగనుంది. తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకువచ్చేందుకు వీలుగా భారతీయ వాయుసేన సీ-17 విమానాన్ని ఉపయోగించనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారత వాయుసేన కూడా ఆపరేషన్ గంగలో పాలుపంచుకోనుంది.
ఇప్పటికే నలుగురు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు దూతలుగా వెళ్లారు. అక్కడ నుంచి భారతీయ విద్యార్థులను తరలించే చర్యలను వేగవంతం చేయనున్నారు. హంగేరి, రోమేనియా, పోలాండ్, స్లోవేకియా, మాల్టోవా నుంచి భారతీయును తరలిస్తున్నారు. భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి స్పైస్‌జెట్ ఈరోజు స్లోవేకియాలోని కోసిస్‌కు ప్రత్యేక తరలింపు విమానాన్ని నడపనుంది. తరలింపును పర్యవేక్షించేందుకు భారత ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు కోసీస్‌కు వెళుతున్నారు.